నిర్భయ కేసు దోషుల ఉరి మరోసారి వాయిదా..

నిర్భయ నిందితుల ఉరిశిక్ష అమలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా మారింది. మంగళవారం ఉదయం నలుగుర్ని ఉరి తీస్తారని వార్తలొచ్చినా.. పాటియాలా కోర్టు ట్విస్ట్ ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు డెత్ వారెంట్‌పై స్టే విధించింది. ఈ కేసు నిందితుడు పవన్ గుప్తా వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో వరుసగా మూడోసారి ఉరిశిక్ష అమలు నిలిచిపోయింది.