ప్రియుడి మోజులో భర్త హత్య.. సినీఫక్కీలో లారీతో గుద్దించి... మదనపల్లెలో దారుణం

భర్త కళ్లుగప్పి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి సినీఫక్కీలో భర్తను లారీతో గుద్దించి చంపేసింది. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో శనివారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. పెద్దమండ్యం మండలం సిద్దవరం పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన నాగలక్ష్మి, చిన్నరెడ్డెప్పల కుమారుడు బాలసుబ్రహ్మణ్యం(35)కు 11ఏళ్ల క్రితం మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లపాటు పట్టణంలోని కదిరి రోడ్డులో గిఫ్ట్‌ సెంటర్‌ నిర్వహించిన బాలసుబ్రహ్మణ్యం వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో రెండేళ్ల క్రితం తిరుపతికి వెళ్లి అక్కడ ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రేణుక మాత్రం ముగ్గురు పిల్లలతో కలిసి మదనపల్లెలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కె.నాగిరెడ్డితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. అతడితో రాసలీలలు సాగించేందుకు ఆ పార్టీలో మహిళా కార్యకర్తగా చేరింది.




ఇటీవల బాలసుబ్రహ్మణ్యం ట్రావెల్స్ వ్యాపారం మానేసి తిరిగి మదనపల్లె వచ్చేశాడు. అక్కడే ఏదో వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భర్త తిరిగి వచ్చేయడంతో రేణుకకు ప్రియుడిని కలిసేందుకు ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల పేరుతో బయటకు వెళ్లి నాగిరెడ్డితో రాసలీలలు సాగించేది. ఈ విషయం తెలుసుకున్న భర్త పద్ధతి మార్చుకోవాలని రేణుకను హెచ్చరించాడు. అక్రమ సంబంధాలు మానుకుని తనతో కాపురం చేయాలని మందలించాడు. ప్రియుడి వ్యామోహంలో ఉన్న ఆమెకు భర్త మాటలు రుచించలేదు. దీనికి తోడు తన సుఖానికి అడ్డు పడుతున్నాడని బాలసుబ్రమణ్యంపై కక్ష పెంచుకుంది. దీంతో అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుంది.